వంకాయ బజ్జి | Brinjal Bajji Recipe | Eggplant bajji with English Titles ...




:: Brinjal Bajji :: Very delicious and tasty
recipe especially for winter and rainy season.
Ingredients:
1.Besan flour - 1 Cup
2.Pepper Powder - 1/4 teaspoon
3.Ginger Powder - 1/4 teaspoon
4.Red chilli powder - 1 teaspoon
5.Salt to taste
6.Baking soda - 1/4 teaspoon
7.Brinjals - 5
8.Oil for deep fry
9.Ground nuts - 1/2 Cup
10.Onion - 1 small
11.Condiander leaves -1 bunch
12.Roasted Coriander powder - 1/4 teaspoon

Now pour a little water and dilute the dough with
the help of a spoon until that it sticks to the finger.
Mix the dough
well without lumps.
keep a side for 10 minutes.  Now
pour some water in a bowl, add a little salt in it, take the eggplants and cut
each eggplant in half lengthwise in the middle with the help of a knife and cut
each piece in half as shown in the video and put it in this salt water. All
eggplants should also be chopped like this.
Now set these aside and put a pan on the stove and heat
enough oil to fry the bajjis in it. Once the oil is hot, add the
Ground
nuts and
fry. After the
Ground nuts are cooked, put them in a bowl and set aside. Dip
pre-cut eggplants in the batter and fry again in the same oil.
Turn the flame high and fry them for 5 to 6 minutes,
stirring occasionally with the help of a spoon.
Once the bajjis are browned and red, take them out and
put them in a serving bowl.
Add onion, coriander
leaves and fried coriander powder to the pre-fried groundnuts.
Mix well
with the help of spoon.  Cut the Brinjal
Bajji in the middle and stuff the roasted peanuts and onion mixture. 


:: వంకాయ బజ్జీ ::
కావలసినవి:
1.శనగ పిండి - 1 కప్పు
2.మిరియాల పొడి - 1/4 టీస్పూన్
3.శొంటి పొడి - 1/4 టీస్పూన్
4.మిరప పొడి - 1 టీస్పూన్
5. రుచికి తగ్గ ఉప్పు
6.తినే సోడా - 1/4 టీస్పూన్
7.వంకాయలు  - 5
8. ఫ్రై కోసం నూనె
9. పల్లీలు  - 1/2 కప్పు
10.ఉల్లిపాయ  - 1 చిన్నది
11.కొత్తిమీర  -1 కట్ట
12. వేయించిన ధనియాలపొడి - 1/4
టీస్పూన్

తయారి విధానము: ఒక గిన్నెలో శనగ పిండిని తీసుకొని ఈ పిండిలో
మిరియాల పొడి
, 3.శొంటి పొడి, మిరప పొడి
రుచికి తగ్గ ఉప్పు
వేసుకొని
, కొద్దిగా తినే సోడా వేసి ఈ పొడులన్ని కలిసిపొయే లాగా బాగా కలపాలి.  ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు
పోసుకుంటూ ఒక స్పూను సహాయముతో పిండిని పలుచగా వేలుకు అంటుకు పోయేలాగా
కలుపుకోవాలి.  పిండిని ఉండలు కట్టకుండా
బాగా కలుపాలి.  ఇప్పుడు ఈ పిండిని ఒక పది
నిమిశములు పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పొసుకొని,  అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని, వంకాయలను తీసుకొని ఒక్కోక్క వంకాయని
చాకు సహాయముతో మద్యలో పొడుగుగా రెండు భాగాలుగా కొసి వీడియో లో చూపిన విధముగా
ఒక్కొక్క భాగాన్ని సగం వరకు కోసి కొని ఈ ఉప్పు నీళ్లలో వేసుకోవాలి.
 ఇలా అన్ని వంకాయలను కూడా కోసుకోవాలి.  ఇప్పుడు వీటిని ప్రక్కకు పెట్టుకొని పొయ్యి మీద
ఒక మూకుడు పెట్టుకొని అందులో బజ్జీలను వేయించడానికి సరిపడా నూనె పొసుకొని వేడి
చేసుకోవాలి.  నూనె వేడి అయ్యాక పల్లీలను
వేసుకొని వేయించు కోవాలి
, ఈ పల్లీలు భాగా వేగిన తరువాత వీటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టాలి.  మళ్లీ ఇదే నూనెలో ముందుగా కోసి పెట్టుకున్న
వంకాయలను శనగపిండిలో ముంచి వేసుకోవాలి
.
పొయ్యి మంట ఎక్కువగా పెట్టుకొని ఒక స్పూను సహాయముతో
బజ్జీలను అటు ఇటు తిప్పుకుంటూ
5 నుంచి 6 నిమిశముల వరకు వేయించుకోవాలి.  బజ్జీలు
భాగా వేగి ఇలా ఎరుపు రంగులోకి వచ్చిన తరువాత వీటిని తీసుకొని సెర్వింగ్ గిన్నెలో
వేసుకోవాలి.  ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలలో
ఉల్లిపాయ
, కొత్తిమీరు మరియు వేయించిన ధనియాల పొడిని వేసుకొని భాగా కలుపుకోవాలి.  ఇప్పుడు వంకాయ బజ్జీలకు మధ్యలో ఒక గాటు పెట్టుకొని
వీటిలో పల్లీల మిశమాన్ని వేసుకోవాలి అంతే వంకాయ బజ్జీలు రడీ.....

Comments